![]() |
![]() |

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu).ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -329 లో.....ఇప్పుడు ఈ నగల విషయం బయట పడితే నన్ను ఇంట్లో నుండి గెంటేస్తారని శ్రీవల్లి భయపడుతుంది. మరొకవైపు ఆనందరావు తీసుకొని వెళ్లిన డబ్బుతో పాటు రెట్టింపు డబ్బు తీసుకొని వస్తాడని భాగ్యం ఎదురు చూస్తుంది. ఆనందరావు వచ్చి వాడు నన్ను మోసం చేసాడని చెప్పగానే భాగ్యం షాక్ అవుతుంది. ఆనందరావుని భాగ్యం కొడుతుంది. అప్పుడే శ్రీవల్లి ఫోన్ చేసి నగల విషయం చెప్తుంది.
నువ్వేం కంగారుపడకు నగలన్నీ ఒక గొయ్యి తీసి అందులో పెట్టు ఎవరికి తెలియదని భాగ్యం ఐడియా ఇవ్వడంతో శ్రీవల్లి సరే అంటుంది. మరొకవైపు నగలు తీసింది.. ఆ శ్రీవల్లినే.. వెళ్లి తన రూమ్ లో వెతకాలని నర్మద, ప్రేమ అనుకుంటారు. వాళ్ళు వచ్చేలోపు శ్రీవల్లి నగలు తీసుకొని బయటకు వచ్చి.. గొయ్యి తవ్వి అందులో పెడుతుంది. ఈ వల్లి అక్క గదిలో నగలు లేవు.. నాకు తనని ఎలా బయటకు రప్పించాలో తెలుసని నర్మద అనుకుంటుంది.
ఆ తర్వాత నర్మద, ప్రేమ కలిసి ఇంటికి ఒకతన్ని తీసుకొని వస్తారు. అతను స్వామిలాగా గెటప్ వేసుకొని వస్తాడు. ఇంట్లోకి వస్తోంటే ఎవరితను అని వేదవతి అడుగుతుంది. నగలు కనిపెట్టాడనికి వచ్చాడని నర్మద చెప్తుంది. అప్పుడే శ్రీవల్లి వచ్చి ఎవరు ఇతను అని అడుగుతుంది. నగలు ఎక్కడున్నా ఎవరు తీసిన కనిపెడుతాడని ప్రేమ చెప్పగానే శ్రీవల్లి షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |